అనుమతి లేని ఆసుపత్రులు సీజ్
హుజూర్ నగర్ సెప్టెంబర్ 24( జనం సాక్షి): సూర్యాపేట జిల్లా పరిధిలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని శనివారం పలు ప్రైవేట్ ఆసుపత్రులు పరిశీలించగా ఆక్సిజన్ హాస్పిటల్ నందు అనుమతులు లేని మందుల షాపు నిర్వహణ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకపోవడం రికార్డులు లేకపోవడం ద్వారా ఆక్సిజన్ హాస్పిటల్ ను సీజ్ చేసినట్టుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటా చలం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న పది రోజుల్లో అన్ని ఆసుపత్రులు పరిశీలిస్తున్నట్లు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్యగౌడ్ జిల్లా మేనేజర్ భాస్కర్ రాజు, మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.