అనుమానాస్పదస్థితిలో ఇద్దరు మృతి
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ముకుంద సినిమా థియేటర్ సమీపంలోని కుంటలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పదస్థితిలో కనిపించాయి. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.