అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

దండేపల్లి(ఆదిలాబాద్ జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు నర్సయ్య(55) గురువారం మృతి చెందాడు. అయితే అతను గత కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నట్లు సమాచారం. గురువారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లిన అతను పొలం వద్దనే పడి మృతి చెందాడు.
అయితే పొలంలో ఎత్తయిన గట్టు నుంచి నడిచే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడి మరణించాడా, లేక వడదెబ్బ తగిలి మృతి చెంది ఉంటాడా అని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.