అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి
వరంగల్ : యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌ను తగులబెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.