అనుమాన స్పద స్థితిలో యువకుని మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుంద్రపల్లి కి చెందిన కుడుదుల ప్రజ్వల్ 25 సంవత్సారాల యువకుడు దుంద్రపల్లి లోని చెరువులో అనుమాన స్పద స్థితిలో శవమై తెలాడు.వివరాలలోకి వెళ్తే ప్రజ్వల్ వేములవాడ లోని ఏరియా హాస్పిటల్ లో పని చేస్తున్నాడు కాగా ఈ నెల పన్నెండున విధులు నిర్వహిస్తుండగా ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చిందని సిబ్బంది కి ఇంటికి వస్తానని చెప్పి ఇంటికి రాలేదు కాగా ఈ సోమవారం రోజున గ్రామ చెరువులో శవమై తెలాడు గమంచిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏ ఎస్ ఐ చంద్రమౌళి మృతదేహాన్ని స్థానికుల సహాయం తో బయటకు తీయించారు. అనంతరం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతుని తల్లి మంజుల పిర్యాదు మేరకు అనుమాన స్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ అభిలాష్ తెలిపారు