అన్నదాతల ఆందోళన
వరంగల్: జిల్లాలో వేళాపాళాలేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన అన్నదాతలు పలు మండలాల్లో ఆందోళన బాట పట్టారు. రాయపర్తి, వర్థన్నపేట, బచ్చన్నపేటల్లో బస్‌స్టేషన్‌లను ముట్టడించారు. లేబర్తిలో విద్యుత్ ఆపరేటర్‌ను నిర్భందించారు. విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు.