అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఐ నాయకుడు దండి రంగారావు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్ లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని దండి రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా స్టేట్ మెంబర్ బోడెపూడి రాజా, తిరుమలపాలం సబ్ఇన్స్పెక్టర్ వరాల శ్రీనివాసరావు మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దండి సుధాకర్, పోలేపల్లి ప్రభాకర్, షాబాద్ సైదిరెడ్డి, రెబ్బగోండ్ల గోపి, మెడికంటి ఉమా, పొట్లకాయల వెంకటేష్, గండు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు