అన్నివర్గాల కోసమే ఉమ్మడి అజెండా: పొన్నం

కరీంనగర్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణ నియంత సీఎం కేసీఆర్‌ను కూల్చేందుకే తాము మహాకూటమిగా జతకట్టామని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాము అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటామని, ఉమ్మడి అజెండాతోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. కేసీఆర్‌కో హఠావో.. తెలంగాణ బచావో అన్న నినాదంతో టీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏర్పడిన రాజకీయ విపత్తును ఎదుర్కొనేందుకే మహా కూటమి ఆవిర్భవించిందని  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రమనే బస్సును సీఎం కేసీఆర్‌ డ్రైవర్‌కు అప్పగిస్తే.. పరిపాలన చేతగాక స్టీరింగ్‌ వదిలేశాడని  విమర్శించారు. కేసీఆర్‌ పరిపాలన ఫిట్‌నెస్‌ కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల వేతన త్యాగం, పోరాటాలతో సీఎం అయిన కేసీఆర్‌ వారిని విస్మరించడం దారుణమని  విమర్శించారు.  మహాకూటమి అధికారంలోకి వస్తే.. కార్మికుల డిమాండ్లకు కనీస ఉమ్మడి ప్రణాళికలో చోటు కల్పిస్తామని, అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని మహాకూటమి నేతలు హావిూ ఇస్తున్నారు. కార్మికుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు వారిని పట్టిం చుకోకపోవడం ఆయన నియంతృత్వానికి నిదర్శమని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను బూతులు తిడుతున్నాడని దుయ్యబట్టారు. కొత్త బస్సుల కొనుగోళ్లు, అద్దె బస్సుల రద్దు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలను ఉమ్మడి కనీస ప్రణాళికలో పెట్టి, మేనిఫెస్టోలో చోటు కల్పి స్తామని హావిూ ఇచ్చారు.