అన్ని కుల మతాలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ…
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి
కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి /
శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రజాస్వామ్య యుతంగా జరిపిన దానిలో ఏఐసిసి అధ్యక్షులుగా సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే ను ఎన్నుకోవడం మండల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించడం, అదేవిధంగా కష్టపడిన వారికి ఉన్నత స్థాయి పదవిని పార్టీలో కలిపిస్తుంది అనేదానికి ఇదొక పెద్ద నిదర్శనమన్నారు.బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ,గాంధీల పార్టీ అనే విమర్శకు ఇది సరైన సమాధానంగా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక పార్టీ అన్ని కుల మతాలకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి పార్టీ అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే కాలంలో అందరము కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అయుబ్ ఖాన్,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సత్యానందం, పోలేపాక నాగరాజు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు రఫీ ఖాన్, కొమటిపల్లి పాత తండా సర్పంచ్ ఇస్లావత్ బాలు నాయక్, రమావత్ స్వామి, లెంకలపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు
Attachments area