అన్ని గ్రామాల్లో ఫిషరీస్ సొసైటీని ఏర్పాటు చేయాలి-మందుల రమేష్
మండలలోని కుమారి గ్రామంలో సోమవారం రోజున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం మత్స్యకారుల గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండాను సంఘం అధ్యక్షుడు ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు మందుల రమేష్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిషరీస్ కార్పొరేషన్ అన్ని గ్రామాల్లో ఫిషరీస్ సొసైటీ ముదిరాజ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మత్సకారులకు చేపల పెంపకానికి ఉచితంగా చేప పిల్లలు అందించి ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్నిదేనని అన్నారు.గ్రామ మత్సకారుల సొసైటీ ప్రెసిడెంట్ సుంకరి రాములు ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు మందుల రమేష్ విడిసి చైర్మన్ శంకర్ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.