అన్ని పక్షాల రంగు బయటపడుతుంది: కేటీఆర్
హన్మకొండ: తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో అన్నీ రాజకీయపక్షాల రంగు బయటపడుతుందని తెరాస నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీనుంచి బయటకు రావాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌లో వుంటూ తెలంగాణ వాదులమంటే ఎవరూ ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌లో వుంటూ తెలంగాణ వాదులమంటే ఎవరూ ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. శనివారం జరిగే కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ అంశాన్ని చర్యకు రానివ్వకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.