అన్ని పార్టీలను మార్చ్‌కు కలుపు పోవుడే

తెలంగాణ మార్చ్‌ చారిత్రాత్మక ఘట్టం కావాలి: కోదండరామ్‌

సెప్టెంబర్‌ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి నుంచి 15వ తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలను చేపడుతున్నట్లు తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ చెప్పారు మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలో తెలంగాణ సన్నాహక సదస్సులో ఆయన శనివారం పాల్గొన్నారు. అందరి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధనే అని, అందుకు వివిధ రాజకీయ పార్టీలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు కొంత మంది సీమాంధ్ర పెట్టుబడిదారులే ఆటంకంగా ఉన్నారు తప్ప ప్రజలు కాదని ఆయన అన్నారు. తెలంగాణ మార్ప్‌కు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని రావడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. పార్టీలు, వ్యక్తులతో తమకు విభేదాలు లేవని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షను గ్రహించి వెంటనే తెలంగాణ రాష్టాన్న్రి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ |ల్‌ిల ారిత్ఘాత్మక ఘటత్శి కావాల” ఆయన కఙాు.

తాజావార్తలు