అన్ని వర్గాలకు అభివృద్ధినే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం
* భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య
టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి): అన్ని వర్గాల ప్రజలకు ప్రజా సంక్షేమం అభివృద్ధినే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు కు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలో పర్యటిస్తూ చింతోనిచిలక, సులానగర్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థి యువత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సులానగర్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఒక వైపు సంక్షేమ మరొకవైపు అభివృద్ధిని సాధిస్తూ బంగారు తెలంగాణ సాధించుట కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. క్రీడా ప్రాంగణాన్ని విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణిస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సర్పంచ్ అజ్మీర బుజ్జి, ఉప సర్పంచ్ ఉండేది బసవయ్య మాట్లాడుతూ మూడు నాలుగు తరాలుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న కొందరికి కి భూములకు పట్టాలు హక్కులు కల్పించలేదని, ఎస్సీ కాలనీ లోని అంగన్వాడి సెంటర్ కు భవనాన్ని నిర్మించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కు స్థానిక అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య రాధా, తహసిల్దార్ కె.వి శ్రీనివాస రావు, ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, పంచాయతీ కార్యదర్శి పవిత్ర, ఏ పీ ఓ, కోయగూడెం సర్పంచ్ ఉమా సురేందర్ ,వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.