అన్ని వర్గాలకు సముచిత న్యాయం

 

* రాందేవ్ బాబా కమ్యూనిటీ భవన నిర్మాణానికి 25 లక్షలు

* పనులు పరిశీలించిన మంత్రి గంగుల

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత స్తానం కల్పిస్తామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
బుధవారం యజ్ఞ వరాహ స్వామి గుడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న రాందేవ్ బాబా సేవా సమితి కమ్యూనిటీభవనాన్ని మేయర్ వై సునీల్ రావు తో కలసి మంత్రి గంగుల పరిశీలించారు.
భవన నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని వారికి సూచించారు. ఇంకా ఏమైన డబ్బులు తక్కువబడితే… సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి… స్థిరపడ్డ మీరంతా ఇప్పుడు ఇక్కడి వారేనని… మీకు సేవ చేసుకోవడం మా కర్తవ్యంగా భావించుకుంటామన్నారు. అంతే కాకుండా… వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గంగుల హామి ఇచ్చారు. మనమందరం కలిసి కరీంనగరాన్ని కలిసికట్టుగా అబివృద్ది చేసుకుందామన్నారు..ఇట్టి భవన నిర్మాణానికి గతంలో 10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు..అసంపూర్తిగా ఉన్న పనుల కోసం మరో 15 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం కరీంనగర్ లోని యజ్ఞవరహా స్వామి వారి ఆలయాన్ని మంత్రి గంగుల సందర్శించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన మంత్రి గంగులకు ఆలయ అర్ఛకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం యజ్ఞవరహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు ,కార్పొరేటర్లు వంగల శ్రీదేవి-పవన్ ,కోల మాలతి -సంపత్ రావు, ఎంపీటీసీ ర్యాకం లక్ష్మి -మోహన్ ,పురమాల్ల శ్రీనివాస్ ,వాసాల రమేష్ ,ఉప్పుల శ్రీధర్ ,ప్రేమ్ కుమార్ ముందడా ,కుల పెద్దలు జవర్ మల్ జి రాజ్ పురోహిత్ , సత్తర్ సింగ్ జి రాజ్ పూత్ ,నర్సీ రామ్ జి చౌదరి ,బాగ్దా రామ్ జి ప్రజా పత్ ,మహేందర్ కుమార్ సేన్ తదితరులు పాల్గొన్నారు.