అన్ని హంగులున్న ఎర్రవల్లి చౌరస్తాని మండల కేంద్రంగా ప్రకటించాలి

మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 29 : పరిపాలన సౌలభ్యం కోసం భౌగోళికంగా, జనాభా ప్రాతిపదికన కలిగి ఉన్న ఎర్రవల్లి చౌరస్తాను మండల మండల కేంద్రంగా ప్రకటించాలని మాజీ అలంపూరు శాసన సభ్యులు ఎస్. ఏ సంపత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా కూడలిలో మండల సాధన సమితి, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. దీక్ష శిబిరానికి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చేరుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించి అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఉన్న ఎర్రవల్లి చౌరస్తాను మండల కేంద్రంగా ప్రకటించక పోవడం చాలా బాధాకరమన్నారు. ఎర్రవల్లి చౌరస్తాను మండల కేంద్రముగా ప్రకటించే వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ సందర్భంగా షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, సాసనూలు సర్పంచ్ మల్లన్న, బి. వీరాపురం సర్పంచ్ రాముడు, జింకలపల్లి ఈదన్న, తిమ్మాపూర్, పుటాన్ దొడ్డి గ్రామాలకు చెందిన సర్పంచులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలో పాల్గొని మండల సాధన కై మద్దతు ప్రకటించారు. దీక్ష శిబిరంలో పి. రాగన్న, కృష్ణసాగర్, మహేశ్వర్ రెడ్డి, ప్రభుదాస్, శివుడు, పెద్ద లక్ష్మన్న, వెంకటన్న, జమ్మన్న, నాగశేషులు తదితరులు పాల్గొన్నారు.