అన్యమత ప్రచారాలపై ఉదాసీనత : స్వరూపానంద
తిరుమల,నవంబర్22: తిరుమలలో అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదని విశాఖ శారదా పీఠాధిపతి అధికారులను మెచ్చరించారు. అన్యమత ప్రచారం జరుగుతన్నా ఉదాసీనత ఎందుకని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించుకుండా టిటిడి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక్కడ కొందరు కావాలని అన్యమత ప్రచారం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా చేయడం వల్లనే పలువురు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్టమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆలయంలో మహాలఘుదర్శనం అమలు చేస్తున్నారు .శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా త్వరలో ఉత్తరాది రాషాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి మాధవం అతిథి గృహంలో శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రాష్టాల్ల్రో శ్రీనివాస కల్యాణాలు నిర్వహణకు ఆయా ప్రాంతాల్లో సీనియర్ అధికారుల బృందం పర్యటించి ముందస్తుగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. మహాయోగులు నివసించిన ప్రాంతాలు మంత్రాలయం, కైవారం, కలాడి, శ్రీపెరంబూర్, హరిహరపురం, బ్రహ్మంగారిమఠం, నారాయణవనం తదితర ప్రదేశాలు, శక్తిపీఠాలున్న ప్రదేశాల్లో ప్రణాళికాబద్ధంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జనవరిలో అలహాబాదులో జరుగనున్న కుంభమేళాకు కోట్లాది మంది హిందువులు హాజరవుతారని, ఆప్రాంతంలో ప్రభుత్వ సహకారంతో స్వామివారి వైభవాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. శ్రీనివాస కల్యాణాలపై బుక్లెట్ రూపొందించాలని ఈవో ఆధికారులకు ఆదేశించారు.



