అపద్బంధు లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

మెదక్‌, నవంబర్‌ 8  : అపద్బంధు పథకం లబ్దిదారులకు 50వేల రూపాయల చెక్కు మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు పంపిణీ చేశారు. గురువారంనాడు స్థానిక తహశీల్దార కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కట్లె సంగీతకు రూ. 50వేల చెక్కును అందజేశారు. కట్లె సంగీత భర్త కట్లె సత్యనారాయణ మృతి చెందడం వల్ల కటుంబంలో సంపాదించే వ్యక్తి మృతి చెందినందు వల్ల రాష్ట్ర ప్రభుత్వం అపద్బంధు పథకం కింద యాభైవేల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.