అప్పు కట్టేస్తా ..కేసుమాఫీ చేయండి` 

విజయ్‌ మాల్యా

న్యూఢల్లీి,మే 14(జనంసాక్షి):భారతీయ బ్యాంకుల్లో తీసుకున్న100 శాతం అప్పు తిరిగి చెల్లిస్తానని, తనపై ఉన్న కేసున్నింటిని మూసివేయాని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నెకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు రూ.20 క్ష కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందను తొపుతూ మాల్యా తాజా అభ్యర్థన చేశారు. తాను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించేందుకు మళ్లీమళ్లీ ప్రయత్నిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  ‘కొవిడ్‌ `19 రిలీఫ్‌ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి నా అభినందను. వారు కావానుకుంటే ఎన్ని  కరెన్సీ నోట్లనైనా ముద్రించుకోగరు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో తీసుకున్న 100 శాతం రుణ బకాయిు తిరిగి చెల్లిస్తానంటున్న నాంటి చిన్న కంట్రిబ్యూటర్ల అభ్యర్థనను ప్రతిసారి పెడచెవిన పెట్టవచ్చా? ఎలాంటి షరతు లేకుండా నాకు ఇచ్చిన రుణ బకాయిు తిరిగి తీసుకుని, నాపై ఉన్న కేసు మూసేయండి’ అని మాల్యా ట్వీట్‌ చేశారు. విజయ్‌ మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల్లో రూ.9000 కోట్ల రుణాు పొంది 2016లో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ండన్‌లో ఉన్న ఆయనను తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.