అఫ్ఘనిస్తాన్‌లో భూపంకం – 100 మంది దుర్మరణం
అఫ్ఘనిస్తాన్‌లో
భారీ భూకంపం
100 మంది మృతి.. భారీగా ఆస్తి నష్టం
కాబుల్ : ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో మంగళవారం ఆరగంట వ్యవధిలో రెండు సార్లు తీవ్రంగా భూమి కంపించింది. దీంతో కొండచరియలు విరిగిపడి పక్కన ఉన్న ఇళ్ళ పై పడడంతో సుమారు వంద మంది వరకు దుర్మరణం చెందగా 25 -30 ఇళ్లు నేలమట్టం అయ ూ్యయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొదటి సారి భూకంపం రిక్టర్ స్కేలుపై 5.4 నమోదు కాగా, రెండో సారి 5.7గా నమోదయినట్లు అధికారులు తెలిపారు. బగ్‌లాన్ ప్రాంతంలో శిధిలాల కింద కూరుకుపోయిన ఇద్దరు మహిళల మృత దేహాలను సహాయక బృందాల సభ్యులు బయటకు తీశారు. ఐదు జిల్లాల్లో ఇళ్లు ధ్వంసమై భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు. శిధిలాల కింద మృతదేహాలు ఉన్నట్లు గుర్తించామని, వాటి తొలగింపునకు బుల్‌డోజర్స్, ఇతర యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.