అబద్దపు ప్రచారం ఆపండి

` ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫైర్‌
` రుణమాఫీపై మా వాగ్దానాన్ని నెరవేర్చామంటూ ప్రధానికి లేఖ
హైదరాబద్‌(జనంసాక్షి):రుణమాఫీ వాగ్దానంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ దానిని నెరవేర్చలేదని… రైతులు రుణమాఫీకి ఎదురుచూస్తున్నారంటూ మహారాష్ట్ర ఎన్నికల సభలో విమర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో  తాము రుణమాఫీని తమ ప్రభుత్వం  ఏ విధంగా చేసిందో లేఖ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ‘‘ తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల రుణమాఫీ వాగ్దానాన్ని నెరవేర్చింది.క్షేత్ర స్థాయి పరిస్థితులను భిన్నంగా వచ్చిన విూ (ప్రధానమంత్రి) ప్రకటన వేదనకు, ఆశ్చర్చాన్నికి గురి చేసింది.తెలంగాణలో రూ.2 లక్షల వరకు రైతులకు ఉన్న రుణాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మాఫీ చేసింది.తొలుత 2024, జులై 18న రూ.లక్ష వరకు రుణాలున్న 11,34,412 మంది రైతుల ఖాతాలకు రూ.6,034.97 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.తర్వాత జులై 30వ తేదీన 6,40,823 మంది రైతుల రుణ ఖాతాలకు రూ.6,190.01 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.ఆగస్టు 15వ తేదీన  4,46,832 మంది రైతుల రుణ ఖాతాలకు రూ.5,644.24 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.మొత్తం 22,22,067 మంది రైతులకు చెందిన రుణ ఖాతాలకు రూ.17,869.22 కోట్లు బదిలీ చేసింది.27 రోజుల వ్యవధిలోనే 22,22,067 మంది రైతులను రుణవిముక్తులను చేశాం.రైతులపై రుణ భారం లేకుండా చూడడంతో పాటు రాష్ట్ర వ్యవసాయ ఉత్పాదకతలో పెంచడంలో వారిని బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేందుకు రుణమాఫీనే నిదర్శనం.రుణమాఫీ రైతులను బలోపేతం చేయడమే కాదు వారిలో నైతిక స్థైరాన్ని నింపుతుందని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం.రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న వారికి రుణమాఫీ వర్తింపజేస్తాం.రూ.2 లక్షలకుపైగా ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మేం మాఫీ చేస్తాం.రుణమాఫీ కోసమే మా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయించింది.అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో రూ.31 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.తెలంగాణ రైతులకు మద్దతు నిలవాలని విూకు విూకు విజ్ఞప్తి చేస్తున్నాం.రాష్ట్రంలో సాగు రంగంపై ఆధారపడిన వారు మోస్తున్న ఆర్థిక భారాన్ని ఉపశమనం కలిగించేందుకు సహకరించండ.రైతుల ఆత్మస్థైరాన్ని తగ్గించే బదులు మనం కలిసి వారిలో ఆత్మస్థైరం పెంపొందించేందుకు ప్రయత్నిద్దాం.రైతుల రుణమాఫీకి చెందిన పూర్తి వివరాలను తెలంగాణ అధికారిక వెబ్‌సైటల్‌లో పూర్తి పారదర్శకతతో ఉంచాం.రుణమాఫీ ద్వారా మా అంకిత భావాన్ని చాటుకున్నాం.వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా ఇతర రాష్ట్రాలకు ఉదాహారణగా రుణమాఫీ నిలుస్తుంది.తెలంగాణలో రైతు సంక్షేమానికి విూ పూర్తి సహకారాన్ని కోరుతున్నాం….