అబ్దుల్‌ కలాం దేశ మాత ముద్దుబిడ్డ

4
– డీఆర్‌డీవోలో విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 15 (జనంసాక్షి):

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం భరతమాత ముద్దు బిడ్డగా సీఎం కేసీఆర్‌ కొనియాడారు. కలాం గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇవాళ నగరంలోని డీఆర్‌డీవోలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. సీఎం ప్రసంగం వివరాలు.. ఇవాళ హైదరాబాద్‌ తలెత్తుకుని నిలబడిన రోజు. కలాం దేశం గర్వించదగ్గ వ్యక్తి. నమ్మిన సిద్దాంతాన్ని ఆచరించి చూపించిన మ¬న్నతుడు. మిస్సైల్‌లను అభివృద్ధి చేసి మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా కీర్తి గడించారు. భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు. ఇస్రోలోఅనేక పరిశోధనలు చేశారు. కలాం ఎప్పుడూ సామాన్య జీవితమే గడిపారు. తన జీవితాన్నే తన సందేశంగా డీఆర్‌డీవోలో ఉన్నపుడు కూడా చిన్న గదిలో గడిపారు.కలాం మరణవార్త విని అందరం విషాదంలో మునిగిపోయాం. డీఆర్‌డీవోకు కలాం పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరాం. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన వెంటనే అందుకు అంగీకరించిన భారత ప్రభుత్వానికి ధన్యావాదాలు. పొఖ్రాన్‌ అణు పరీక్ష చేసి భారత దేశ సత్తా చాటారు. అణు ప్రయోగం విషయంలో భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. పేదల కోసం తక్కువ ధరకు లభించే స్టెంట్‌ తయారు చేశారు.