పెంచికల్ పేట్, రానాపూర్, గుండారం లో గద్దెనెక్కిన సమ్మక్క, సారక్కలు

 

 

 

 

 

 

 

 

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్, గుండారం రానాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న వన దేవత జాతర మహోత్సవంలో భాగంగా గురువారం సమ్మక్క గద్దెనెక్కింది. డప్పు చప్పుల్లు.. అమ్మవార్ల పూనకాల మధ్య కోయ పూజారులు సమ్మక్క తల్లిని గద్దె పై ప్రతిష్టించారు. ఇప్పటికే సారాలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెకు చేరి భక్తులకు దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుండి వన ప్రవేశం చేసే వరకు సమ్మక్క- సారలక్కల దర్శనం చేసుకుంటూ భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం ) తులాభారం తో పాటు మొక్కలు చెల్లించుకుంటున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని వనదేవతల కృపకు పాత్రులవుతున్నారు.