డ్రగ్స్ పై ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం

 

 

 

 

 

 

 

 

 డ్రగ్స్ తో జీవితం మసి.. మానేస్తే జీవితం ఖుషి’… అనే నినాదంతో

మంగపేట, మేడారం జనవరి 30 (జనంసాక్షి)సమాజంలో నిషేధిత మత్తు పదార్థాలకు యువత చెడు మార్గాలకు అలవాటు పడి ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు ఉన్న సమాజ బాధ్యతతో ముందుకు వచ్చారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ కుంభమేళగా సుప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ తల్లుల మేడారం జాతరలో సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ మేడారంలో జన సమీకరణం ఎక్కువగా ఉన్న ప్రాంతల్లో డ్రగ్స్, గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మెడలో గవ్వల దండలు, తలపై ప్రత్యేక టోపీ ధరించి, చేతిలో మైక్తో “డ్రగ్స్ తో జీవితం మసి…. మానేస్తే జీవితం ఖుషి” అంటూ ఆయన వినూత్నంగా ప్రచారం చేస్తూ తాన నినాదాలతో యువతలో ఆలోచన రేకెత్తిసున్నాయి. మత్తు పదార్థాల పై వినూత్నంగా పాటలు పాడుతూ వాటి దుష్ప్రభావాలను తెలిపే విధానం అందరి దృష్టి ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం సాధించడమే తన లక్ష్యమని అందుకే మేడారం జాతరలో అధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరవుతుండటంతో, ఇక్కడ అవగాహన కల్పిస్తే విస్తృత ప్రభావం ఉంటుందని భావించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి భక్తులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.