అభినవ్‌ బింద్రాకు

 

అరుదైన గౌరవం..

న్యూఢిల్లీ:

ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత స్టార్‌ మాటర్‌ అభినవ్‌ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 27 నుంచి 29 వరకూ సింగపూర్‌లో జరిగే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఒసి) ఎలైట్‌ ఇంటర్నేషనల్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గోనే అవకాశం అతనికి లభించింది. అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) బింధ్రా పేరును ఏకగ్రీవంగా ఆమోదించినట్టు భారత రైఫిల్‌ అసోషియేషన్‌ (ఎన్‌ఆర్‌ఐ) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌ తరుపున ఒలింపిక్స్‌ ఇండివిజువల్‌ ఈవెంట్‌ స్వర్ణ పతకం సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించిన బింద్రాకు ఈ గౌరవం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఇది భారత దేశానికే గర్వకారణమని పేర్కొంది.
బింద్రా మరోసారి మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేశాడని ఆ ప్రకటనలో కొనియాడింది.