అభివృద్దికి తెలంగాణ ఆదర్శం !
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కెసిఆర్ అన్న మూడక్షరాలు సింహనాదంగా మారి.. ఉరకలెత్తించ డమే కాదు… రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది. ఒక్కో అడుగు ముందుకే ఇక అన్న ధైర్యంతో కదనరంగంలో వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిన బాహుబలిగా నిలిచారు. తెచ్చిన తెంలగాణ భౌగోళిక స్వరూపాన్ని మార్చేసి.. అభివృద్ది పథంలో అగ్రభాగాన నిలపడంలో కూడా ఆయన కృషి మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో నిత్యం అనేక ప్రతికూలతలు…విమర్శలు.. దెప్పి పొడుపులు సర్వసాధారణమైనా..ఎత్తిన కాడి దించకుండా ముందుకు సాగుతున్న కృషీవలుడిగా కెసిఆర్ గురించి చర్చించుకోవాల్సిందే. దేశంలోని ఇతరరాష్టాల్రతో పోల్చినా.. కేంద్రం పాలనతో పోల్చినా..ఏ రంగంలో అయినా తెలంగాణ ముందు వరసలో ఉందనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్లకు ముందు పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులపై చర్చ చేస్తే కెసిఆర్ చరిత్ర సృష్టించారనే చెప్పాలి. కెసిఆర్ చేతిలో మంత్రదండం లేదు. కుప్పలుతెప్పులగా ధనరాశులు లేవు. అయినా ఉన్నంతలో శ్రమించి ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందో అన్న ఆలోచనచేసి కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరు అభినందనీయం. ఆయన పథకాలు ప్రజల ఆర్థికస్థితిగతులను బాగుపరిచేవే తప్ప చెడు చేసేవి ఎంతమాత్రం కాదు. పథకాలను పక్కదోవ పట్టించే వారు ఎప్పుడూ ఉంటారు. అయినా తెలంగాణ అభివృద్ది పథకాల్లో ఈ ఎనిమిదేళ్ల కాలమే కీలకమని చెప్పాలి.ఎన్నో ఏళ్ల నుంచి జరగని అనేక కార్యక్రమాలు జరిగాయి. కాళేశ్వరం ఎత్తిపోతలతో గోదావరిని పరుగెత్తించిన అపరభగీరథుడనే చెప్పాలి. గోదావరి నీళ్లు యాదాద్రి చెంతకు వచ్చి స్వామి కాళ్లు కడుగుతున్నాయంటే అది కెసిఆర్ స్వప్నమనే చెప్పాలి. ఇతరులెవరూ ఇంతటి సాహసకార్యం చేస్తారని ఊహించలేము. యాదాద్రి వైభవం..ఎంతచెప్పుకున్నా తక్కువే. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ కావచ్చు..చెరువుల పూడికతీత కావచ్చు..మిషన్ భగీరథ కావచ్చు..అనేకానేక పథకాలతో పాటు తాజాగా అమలు చేస్తున్న దళితబంధు కావచ్చు… కొంత దుబారా ఉన్నప్పటికీ ప్రజలకు మేలుచేసేవిగానే గుర్తించాలి. ఉమ్మడి ఎపిలో ఇంతలా పథకాలను పరుగెత్తించిన దాఖలాలు లేవు. నిజాని కి కెసిఆర్‌కున్న విజన్‌గురించి చర్చించుకోవాలి. ఆయనకు వనరులను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. దేశంలో కూడా ఇలాంటి మార్పులు రావాలన్నదే కెసిఆర్ తపన. అవి సాకారం కావాలంటే రాజకీయ సంకల్పం కావాలి. ఆ సంకల్పంతో సాగుతున్న కెసిఆర్‌కు దేశంలోని ఇతర పార్టీలు సహకరిస్తే మార్పు తప్పకుండా సాధ్యం అవుతుంది. నీటి వనరులను ఉపయోగించుకోవడం, ఉన్న భూముల్లో మంచి పంటలు పండిరచడం, నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని సాకారం చేయడం వంటి లక్ష్యాలను పదేపదే ప్రస్తావిస్తున్న కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో అవకాశం వస్తే ఇవన్నీ చేసిచూపగల దమ్మున్న లీడర్‌గా చెప్పుకోవచ్చు .అందుకే సిఎంగా కెసిఆర్ ఇప్పుడు అందరివాడుగా దేశంలో అడుగిడాలని తపిస్తున్నారు. అందరి ఆశలను తీర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అలాగే తెలంగాణ ఈ ఎమిదేళ్లలో కన్నా మరింత ప్రగతి సాధనలో ముందుకు సాగాల్సిన తరుణమిది. సరికొత్త తెలంగాణ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు సాగాల్సి ఉంది. పెండిరగ్ పనులను పూర్తి చేసుకుంటూనే ప్రధానంగా విద్య, నిరుద్యోగం, ఆరోగ్య రంగాలపై ప్రధాన దృష్టి సారించాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం…. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో టిర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు.. కారణంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే దేశానికి అసవరమైన విధానాలను రూపొందించి ముందుకు సాగారు. చేపట్టిన కార్యక్రమాలు బహుళ ప్రాచుర్యంలోకి తీసుకుని రావాలి. ఘనర్షణాత్మక రాజకీయాలు
సరికాదు. ప్రత్యామ్నాయ రాజకీయంతో దేశప్రజలకు అభివృద్ది ప్రణాళికలను చూపి అమలు చేయించగల ఉద్ధండుడిగా కేసీఆర్ నిలబడతాడనడంలో సందేహం లేదు. నిరంతర కరెంట్ కెసిఆర్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ దీనిని ముట్టుకున్న వారు లేరు. చెరువుల పునరుద్ద రణ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ముందు కనిపిస్తున్న విజయాలు. తెలంగాణ పురోభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వా న్ని ప్రజలు అందుకే దీవించారు. తెలంగాణ అభివృద్ధి, ఆదాయ ప్రగతి ఎట్టిపరిస్థితులో ఆగి పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా కెసిఆర్‌పైన ఉంది. నిరుద్యోగలుకు ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధి పథకాలు పెద్ద ఎత్తున చేపట్టాలి. మన తెలంగాణలో ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదు. ఉద్యోగ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని చెప్పడమే గాకుండా ఇటీవలే వాటికి ప్రకటనలు కూడా అందించారు. దీంతో యువత ఇప్పుడు భరోసాతో ఉంది. ఇప్పటికే 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నందున అనుబంధ రంగాలను అభివృద్ది చేసుకుంటూ పోవాలి. అనుత్పాదక రంగాలకు సంబంధించి కొంత ధైర్యంగా పోవాలి. కిలో రూపాయి బియ్యం ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారింది. ఇది కొందరి జేబులు నింపే కార్యక్ర మంగా సాగుతోంది. మరికొందరికి ఆదాయవనరుగా ఉంది. ఇలాంటి పథకం వల్ల ప్రభుత్వ సొమ్ము వృధా అవుతోంది. దీనిని అరికట్టాల్సి ఉంది. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి వ్యక్తి రికార్డు తయారు చేయిస్తున్నారు. ఈఎన్‌టీ, దంతాలు, అత్యుత్తమమైన ఆరోగ్య పరీక్షలను చేపట్టి ప్రజలందరి రికార్డు తయారు చేయిస్తామన్నారు. ప్రజలకు ఉచిత పథకాలను కొంతయినా తగ్గించుకోవాలి. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హావిూలనే కాకుండా.. ఇవ్వని హావిూలనూ అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పాలి.