వ్యవసాయ యాంత్రీకరణ పునప్రారంభం

` 50% సబ్సిడీతో యంత్రాలను అందిస్తాం:ఉత్తమ్‌
` తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదు: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
కోదాడ జనవరి9(జనంసాక్షి):తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.కోదాడ పట్టణం లో శుక్రవారం రూ.08 కోట్లతో నిర్మిస్తున్న ఆర్‌ డ బి గెస్ట్‌ హౌస్‌ డ డివిజన్‌ కార్యాలయం,రూ 25 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు బిల్డింగ్‌ ,రూ 5.10 కోట్లతో నిర్మిస్తున్న ఇరిగేషన్‌ డివిజన్‌ కార్యాలయం పనుల పురోగతిని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో కలిసి పరిశీలించి పనులు నాణ్యత తో నిర్మిస్తూ, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ కృష్ణ నది నీటి పంపకాల్లో గత ప్రభుత్వం తెలంగాణ కు 34 % (299 టిఎంసిలు), ఆంధ్రకు 66 % (512 టి ఎం సి లు ) అంగీకారం చేసుకోవటం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలు నష్టపోయాయని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కృష్ణ జలాలో 71 % తెలంగాణ కు దక్కేలా పోరాడుతున్నామని,గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో నీటి పారుదల రంగానికి 1.83 లక్షల కోట్ల కేటాయించినప్పటికి కృష్ణ నది పై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు,కొడంగల్‌ నారాయణపేట, డిరడి, ఎస్‌ ఎల్‌ బి సి ప్రాజెక్ట్‌ లు పూర్తి చేయలేదని మేము అధికారం లోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్ట్‌ లు వేగవంతం గా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వచ్చే మూడు సంవత్సరాల్లో కృష్ణా నదిపై నిర్మాణం లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నష్టపోయిన కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ కు దక్కాలసిన వాటా లో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని వాటా కోసం సుప్రీం కోర్ట్‌, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నది ట్రెబ్యూ నల్స్‌ ముందు బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని తెలిపారు.కోదాడ నియోజకవర్గం లో నిర్మిస్తున్న రెడ్ల కుంట లిఫ్ట్‌ ఇరిగేషన్‌, శాంతినగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ లు వేగవంతంగా పూర్తి చేయాలని పాలేరు వాగుపై చెక్‌ డాం, పాలవరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కు, నడిగూడెంలోని చౌదరి చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపాలని, చిలుకూరు వద్ద ముక్త్యా ల బ్రాంచ్‌ కెనాల్‌ పై డబుల్‌ బ్రిడ్జ్‌,పాలే అన్నారంలో బ్రిడ్జ్‌ పనులు త్వరగా ప్రారంభించి ఎండాకాలం చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.మోతే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ భూసేకరణ కొరకు రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని ఆర్డిఓను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌, ఇరిగేషన్‌ సి ఈ రమేష్‌ బాబు,ఎస్‌ ఈ లు నాగభూషణం శివతేజ, ఆర్‌ అండ్‌ బి ఈ ఈ సీతారామయ్య, ఆర్డీవోలు సూర్యనారాయణ ,వేణుమాధవ్‌, తహసిల్దార్‌ వాజిద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.