అభివృద్దిని కాంక్షించి మళ్లీ టిఆర్‌ఎస్‌ను గెలిపించాలి
కెసిఆర్ సిఎం అయితేనే ముందుకు సాగుతాం
వివిధ సంఘాల సమావేశాల్లో రామగుండం అభ్యర్థి సోమారపు
రామగుండం,నవంబర్17(జనంసాక్షి): ప్రజలు అభివృద్దిని కాంక్షించి మళ్లీ తెలంగాణ పార్టీ అయిన టిఆర్‌ఎస్‌కు పట్టం గట్టాలని, అప్పుడే అభివృద్ది సాగుతుందని అన్నారు. ఇప్పుడు చేపట్టిన పనులు కొనసాగాలంటే కెసిఆర్ మరోమారు సిఎం కావాల్సి ఉందన్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గంగానగర్ స్వరూప గార్డెన్స్‌లో నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పూసల సంఘం వారి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు ..ఈ సందర్భంగా సోమారపు మాట్లాడుతూ విూరందరూ టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పూసల సంఘం వారు చాలా వెనుకబడిన తరగతులవారని వారి సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అయిన వెంటనే సహాయం చేస్తాను అని అన్నారు. వారికి లోన్ సౌకర్యం కల్పిస్తానని అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా వారికి వచ్చేలా సహాయం చేస్తానని చెప్పారు . ఇక ఈ కార్యక్రమంలో నగరమేయర్ శ్రీమతి జాలి రాజమణి , డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్ వడ్లూరి రవి ,పూసల సంఘం అధ్యక్షులు గుండ్ల వెంకటయ్య, కుమ్మరి మల్లేష్, తన్నీరు రాకేష్, సతీష్ ,మహిళా అధ్యక్షురాలు కావేటి విజయలక్ష్మి, వారి సంఘం సభ్యులు /ుసబ. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే గౌతవిూనగర్లో టిఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్స్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి
అందరూ కష్టపడి పనిచేయాలని, రానున్న డిసెంబర్ 7 వ తేదీన జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రజలందరూ కారు గుర్తుకే ఓటేసేలా సైనికుల్లా కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మళ్లీ మన ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారిని గెలిపించుకోవాలని కోరారు ..ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్ కోదాటి ప్రవీణ్, అబ్జర్వర్స్ మురళీధర్రావు, రాజమౌళి ,లింగమూర్తి, దీటి వెంకటస్వామి నీరటి శ్రీనివాస్ ,కొల్లా వెంకటేశ్వర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు ,కోఆర్డినేటర్స్ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.ఎన్టీపీసీ దేవి గార్డెన్స్ లో కార్పొరేటర్ బాలసాని స్వప్న తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సోమారపు సత్యనారాయణ హాజరైనారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ కెసిఆర్ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై 5వ డివిజన్ మారేడుపల్లి , జంగాలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 600.ల మంది, బిజెపి పార్టీకి చెందిన సుమారు 75 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రతి ఒక్కరు మళ్లీ కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేయాలని కారు గుర్తుకే ఓటు వేసి, ఇతరులతో కూడా ఓటు వేయించాలని బంగారు తెలంగాణలో విూరు కూడా పాలు పంచుకోవాలని కోరారు.