అభివృద్దిని కొనసాగిస్తా: సుంకె రవి
కరీంనగర్,నవంబర్15(జనంసాక్షి): తనను గెలిపిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చుతానని టీఆర్‌ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తనకు టిక్కెట్ రాలేదని, కేసీఆర్ ఇచ్చిన హావిూ మేరకు ఈసారి టిక్కెట్ ఇచ్చారన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరికి ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడగడతానని చెప్పారు. ఇప్పటి వరకు 105 గ్రామాల్లో తిరిగినట్లు ఆయన తెలిపారు. ప్రజలు కూడా అభివృదద్‌ఇనే కోరుకుంటున్నారని రవిశంకర్ పేర్కొన్నారు. 2014లో బొడిగె శోభకు కేసీఆర్ టిక్కెట్ ఇస్తే.. తాను ఆమెవెన్నంటే ఉండి శోభ గెలుపుకు కృషి చేశానని చెప్పారు. ఇప్పుడు ఆమె తన వెన్నంటే ఉండి పనిచేస్తుందని బావించానని, కానీ టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తి చెంది.. బీజేపీలోకి వెళ్లిపోయారని అన్నారు. ఆమె తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వచ్చి తనకు మద్దతుగా పనిచేయాలని రవిశంకర్ విజ్ఞప్తి చేశారు.