అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలి
-ఇంచార్జి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
పెద్దపల్లి,అక్టోబర్ 24(జనంసాక్షి): జిల్లాలోని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అభివృద్ది కార్యక్రమాలు, డబుల్ బెడ్‌రూం పథకంపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ త్వరగా పూర్తి చేసి ప్రజలకు వాటి పలాలను అందించాలన్నారు. ప్రతి గ్రామంలో చెత్తను డంపింగ్ చేయడానికి అనుకూలమైన స్థలాలను తహశీల్దార్లు నేటిలోగా (25వతేదీ) ఎంపిక చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి విడతగా జిల్లాకు 1406 ఇల్లను మంజూరు చేసినప్పటికి పనులు ఆస్థాయిలో జరుగడంలేదని ఎమ్మెల్యేలు చూచించిన మేరకు స్థలాలను సేకరించాలన్నారు. వీటికోసం ఎకరంనుంచి ఐదు ఎకరాల స్థలం కావాలన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి గుర్తించిన స్థలాల్లో డంపింగ్ యార్డులు, రెండు పడకల గదుల ఇల్లను నిర్మించేందుకు అధికారులు
కృషిచేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్దయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామల్లో చెత్త నిర్వహణ సక్రమంగా జరగటానికి కనీసం రెండు మూడు సంవత్సరాలనుంచి పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి డీఆర్‌ఓ అశోక్ కుమార్, ఆర్‌డీఓ పద్మయ్య తదితరులు పాల్గొన్నారు.