అభివృద్ది పథకాలు ఆనాడు ఎందుకు చేపట్టలేదు: విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): అడగకున్నా వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్‌ అని, మేనిఫెస్టోలోని అంశాలతో పాటు మానవకోణంలో ఆలోచించి అందులో లేని మరెన్నో హావిూలను నెరవేర్చారని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు అన్నారు. కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌, రైతు బంధు పథకం, కంటి వెలుగు, నిరంతర విద్యుత్‌ వంటి అనేక పథకాలను ఎవరూ అడగకపోయినా మానవీయ కోణంలో ఆలోచించి ప్రవేశ పెట్టారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కలగూర గంపలా కాంగ్రెస్‌, టీడీపీ, మరికొన్న తోక పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయనీ, అది మ హాకూటమి కాదు మాయ కూటమి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 50 ఏండ్లు కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు పాలించాయనీ, అప్పుడెందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతు బంధు, మిషన్‌ భగీరథ వంటి ప్రజోపయోగ పథకాలను చేపట్టాలనే ఆలోచన ఆ ప్రభుత్వాలకు రాలేదని ప్రశ్నించారు. పదవులపై ఉన్న ద్యాస, ఆరాటం వారికి ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. నాలుగేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆశీర్వదించండానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. తాను  నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నానన్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.