అభివృద్ధిని చూసి ఓటు వేయండిఅభివృద్ధిని చూసి ఓటు వేయండి
– కార్మికుల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
– డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ వెల్లడి
గోదావరిఖని, నవంబర్ 11, (జనంసాక్షి) :
రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి సింగరేణి కార్మికులు ఓటు వేయాలని, ఆ అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం తిలక్‌నగర్‌లో గల 37వ డివిజన్‌లో రామగుండం టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు మద్దతుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల ఘనత టీఆర్‌ఎస్‌కు చెందుతుందన్నారు.మోసపూరిత నాయకులు మీ ముందుకు వస్తున్నారని వారిని నమ్మవద్దని కోరారు. సోమారపు సత్యనారాయణను గెలిపిస్తే రెండింతల అభివృద్ధి సాధించడం జరుగుతుందని చెప్పారు.
అదే విధంగా ఆర్‌జీ-2 పరిధిలోని జీడీకే.7 ఎల్‌ఈపీ ఆవరణలో కూడా టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు సోమారపు సత్యనారాయణ గెలుపు కోసం ఇంటింటి ప్రచాం చేపట్టారు. ఈ ప్రచారంలో 150 మంది పాల్గొన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ తిలక్ నగర్ పట్టణ కమిటీ అధ్యక్షుడు అనిల్ యాదవ్ 37 డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి తిలక్ నగర్ పట్టణ కమిటీ అబ్జర్వర్ 37వ డివిజన్ పరిశీలకులు, ఫిట్ సెక్రెటరీ ఎండి ప్యారేమియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు నాగ ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, తాటి రాయమల్లు, మహంకాళి అంజయ్య, రవీందర్, 36వ డివిజన్ కార్పొరేటర్ పాము కుంట్ల లలితభాస్కర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ పార్టీలో దాదాపు 50 మంది కార్యకర్తలు డివిజన్ నుండి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారిని డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ పార్టీ లోనికి ఆహ్వానించారు.