అభివృద్ధిలో ఏఈ జనార్ధ సేవలు మరువలేనివి..
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 15
శంకరపట్నం మండలం అభివృద్ధి కోసం ఏఈగా సేవలందించిన జనార్ధన్ సేవలు మండల ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని, శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పదోన్నతి పై వెళ్తున్న శంకరపట్నం ఏ ఈ జనార్ధన కు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. శంకరపట్నం మండలం పంచాయతీ రాజ్ ఏ ఈగ విధులు నిర్వహించిన ఈసరి జనార్ధన్ డి ఈ గా పదోన్నతి పొంది పెద్దపెల్లి జిల్లాకు బదిలీ కావడంతో ఆయన సేవలను గుర్తించి శంకరపట్నం మండల ప్రజా ప్రతినిధుల అధికారుల ఆధ్వర్యంలో పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించి బదిలీపై వెళ్తున్న జనార్ధన్ కు వీడ్కోలు పలికినట్లు చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు మండలములో చిరకాలం నిలిచిపోతున్నాయని ఆ జనార్ధన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, తహసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో ఖాజా బషీరో ద్దీన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, కొత్తగట్టు మచ్చ గిరేంద్ర స్వామి మాజీ చైర్మన్ తూముల శ్యామ్ రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు,