*అభివృద్ధే ఆయన మంత్రం… మొక్కవోని దీక్ష వారి నైజం..

టిఆర్ఎస్ లో భారీ చేరికలే అందుకు నిదర్శనం..
ప్రభుత్వ విప్ గొంగిడి సునిత,డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి*
ఆలేరు. జనం సాక్షి
రాష్ట్రాభివృద్దికి అహర్నిశలు శ్రమిస్తూ,అభివృద్ధి కి మారుపేరుగా నిలిచిన మహానేత ముఖ్యమంత్రి కేసిఆర్ అని ప్రభుత్వ విప్,ఆలేరు ఎంఎల్ఏ గొంగిడి సునిత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్,టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లు అన్నారు.
ఆలేరు వైస్ ఎంపిపి గాజుల లావణ్య వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రేగళ్ల లింగం ఆలేరు మండలం కొల్లూరు గ్రామ కాంగ్రేస్ పార్టీ నుండి నాయకులు,కార్యకర్తలు బుదవారం గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో 500 మందికి పైగా భారీగా టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.ఈసంధర్భంగా వైఎస్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలో వారు ముఖ్య అతిధులు పాల్గొని మాట్లాడారు.
 కొల్లూరు గ్రామంలోని అందరూ టిఆర్ఎస్ పార్టీ గులాబీ కుటుంబంలో చేరటం సంతోషమని అన్నారు.గ్రామాలలో  సర్పంచులు,ఎంపిటీసీలు, ప్రజాప్రతినిధులు అధికార పక్షంలో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు కొల్లూరు గ్రామ నాయకులు,ప్రజలు గమనించి గ్రామానికి గ్రామమే టిఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని అభినందిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా యాదగిరిగుట్ట మండలం సాదువెళ్లి,గౌరాయపల్లి,కంటంగూడెం గ్రామాలకు చెందిన 200 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరడం,అందులో కోఅప్షన్ సభ్యులు, వార్డు,మెంబర్లతో పాటుగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటీసీలు ఉండటం శుభసూచకమని చెప్పారు.ఈ నెలలోనే నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపి ల నుండి 5 వేల మందికి పైగా టిఆర్ఎస్ పార్టీ లో చేరడంతో ఉద్యమ పార్టీ మరింత బలోపేతం అయిందని చెప్పారు.గులాబీ కుటుంబంలో చేరటం గొప్ప మార్పు అని అన్నారు.కర్ణాటక రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉందని అయినా తెలంగాణ ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలు అక్కడ లేవని అన్నారు.నేడు దేశానికే తెలంగాణ రోల్ మాడల్ గా నిలిచిందని పేర్కొన్నారు.తెలంగాణాలో సిఎం కేసిఆర్ అమలు చేస్తున్న వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్,రైతుభందు,రైతుభీమా లాంటి పధకాల గురించి  దేశంలో ప్రతి రైతు కేసిఆర్ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నారని చెప్పారు.తెలంగాణ సంక్షేమ పధకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని బిజెపి ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవిందర్,వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు,టంగుటూరు ఎంపిటీసి జూకంటి అనురాధ అనిల్,ఆలేరు యాదగిరిగుట్ట మండల పార్టీ ల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, కర్రె వెంకటయ్య లు,మాజీ ఎంపిపి క్యాసగల్ల అనసూయ, వైస్ ఎంపిపి కిష్టయ్య,సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పత్తి వెంకటేష్,మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మొరిగాడి వెంకటేష్, పుట్ట మల్లేష్,భారీగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.