అభ్యర్థులు సమయపాలన పాటించి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

కలెక్టర్ అనురాగ్ జయంతి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 14 (జనం సాక్షి) గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు సమయపాలన కచ్చితంగా పాటించి నిర్దేశించిన సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 4వేల పైగా విద్యార్థుల పరీక్షలు రాస్తుండగా 17 సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. ఉదయం 8:30 గంటలలోగా సంబంధిత పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్ ఫోన్, లాప్టాప్ కానీ ఏలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాలకు అనుమతించబడవని అన్నారు. పరీక్షకు హాజరయ్యే వారు బ్లాక్, బ్లూ పెన్నులను వినియోగించాలని అన్నారు. హాల్ టికెట్లు ముందుగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉందని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎలాంటి ఆందోళన చెందకుండా ముందస్తు సూచనలు పాటించి పరీక్షల్లో విజయ సాధించాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రశాంతంగా పరీక్షలు జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.