అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఆదిలాబాద్‌, మార్చి 22: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని 27 మంది తెలంగాణ అమరుల కుటుంబాలకు మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేశారు.