అమరుల త్యాగాలు మరువలేనివి

 –జెండాను పంపిణీ చేసిన ,ఎమ్మెల్యే, మాణిక్ రావు
ఝరాసంగం ఆగస్టు 9 (జనంసాక్షి) స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన  అమరుల త్యాగాలు మరువలేనివి అని జహీరాబాద్ ఎమ్మేల్యే మాణిక్ రావు అన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని ఆగష్టు తేదీ 8 నుండి తేదీ 22 వరకు రాష్ట్ర సీఎం కేసీఆర్  నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే  భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని  ఝరాసంగం మండల కేంద్రం లో ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీకి  ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే  కోనింటి మాణిక్ రావు  ముఖ్య అథితులుగా హాజరై జాతీయ జెండాలను అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ….భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ  వ్యాప్తంగా ఆగష్టు 8నుండి 22 వరకు స్వతంత్ర వజ్రోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లక్షలాదిమంది ప్రజల పోరాటం వేలాదిమంది ప్రాణ త్యాగాలతో బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. వారి పోరాటం ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు అందులో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ప్రజలు జాతీయ జెండాను తమ ఇళ్లపై ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. .వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై వజ్రోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..అనంతరం సినిమా థియేటర్లో మహాత్మ గాంధీజీ చిత్రాన్ని  తిలకించాలని. విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రాచయ్యా స్వామి, సర్పంచ్ పారం అద్యక్షుడు జగదీశ్వర్, ఆత్మ కమిటీ చైర్మన్ పేంటా రెడ్డి, నాయకులు, సంతోష్ పాటిల్, సంగమేశ్వర్ పాటిల్,నర్సింలు, ఎంపీడీఓ సుజాత,టౌన్ అద్యక్షుడు ఏజజ్ బాబా నాయకులు  ,కార్యకర్తలు యూత్ సభ్యులు, వార్డ్  ప్రజలకు తదితరులు పాల్గొన్నారు.