అమిత్‌షాకు తిరుపతిలో చేదు అనుభవం

స్వామిని దర్శించుకుని వెళుతుండగా అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు
ప్రత్యేక¬దాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌
పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం..స్వల్ప ఉద్రిక్తత
తిరుమల,మే11(జ‌నం సాక్షి ):  ప్రత్యేక¬దా,విభజన సమస్యలపై అట్టుడుకుతున్న ఎపిలో అమిత్‌షాకు చుక్కెదురయ్యింది. తిరుమలలోని అలిపిరి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి దర్శన అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసనకారులు.. అమిత్‌ షా గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయడంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై స్పష్టమైన హావిూ ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయటికొచ్చిన అమిత్‌ షాకు చేదు అనుభవం ఎదురైంది. అలిపిరి గరుడ సర్కిల్‌ దగ్గర టిడిపి కార్యకర్తలు అమిత్‌ షా రాకను నిరసిస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఎపికి ప్రత్యేక ¬దా అంశంపై బిజెపి మోసం చేసిందని, తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హావిూని బీజేపీ తుంగలో తొక్కిందని, మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తిరుమలకొచ్చారని టిడిపి కార్యకర్తలు నిలదీశారు.
తిరుగి ప్రయాణం అవుతుండగా అలిపిరి దగ్గర టీడీపీ కార్యకర్తలు అమిత్‌ షా కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని లాఠీచార్జీ జరిపి ఆందోళన కారులను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కోలా ఆనంద్‌… టీడీపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. దీంతో షా కాన్వాయ్‌ ఒకవైపు, నేతలు, కార్యకర్తలు వచ్చిన కార్లు మరోవైపు వెళ్లిపోయాయి. ఏపీకి ప్రత్యోక ¬దా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకారులు పోలీసులు డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.
ఉదయం శ్రీవారి దర్శనం
ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని అమిత్‌ షా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న అమిత్‌ షాకు తితిదే అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. జేఈవో శ్రీనివాసరాజు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు. అమిత్‌ షా తన మనవరాలితో కలిసి తులాభారం ద్వారా బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
——

తాజావార్తలు