అమెరికాలో డేర్ డెవిల్ స్కై డైౖవర్ ఆల్ టైమ్ రికార్డు
24 మైళ్ల ఎత్తు గగనంలోంచి భూమిపైకి ..
వాషింగ్టన్ : 24 మైళ్ల దూరం నుంచి జంప్ చేసిన ఈ డేర్ డేవిల్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆస్ట్రియాకు చెందిన స్కైడ్రైవర్ ఫెలిక్స్ బామ్‌గాట్నర్ అంతరిక్షపు అంచు నుంచి అంటే దాదాపు లక్షా 28 వేల అడుగుల ఎత్తు నుంచి భూమిపైకి దూకాడు. ధ్వని వేగాన్ని మించిన వేగంతో భూమిని చేరిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు. పదంటే పదే నిమిషాల్లో ఈ అద్భుతం చేయడం మరో విశేషం, రెడ్‌బుల్ స్ట్రాటోస్ సంస్థ ఆధ్వర్యంలో ఆమెరికాలోని న్యూమెక్సికో ఎడారి ప్రాంతం నుంచి, బెలూన్ సాయంతో, కాప్యూల్‌లో ఫెలిక్స్ స్పేస్‌లోకి వెళ్లాడు. ఈ ఫీట్ విజయవంతం కావడంతో అందరూ అతడికి అభినందనలు తెలుపుతూ ఆనందంతో పండగ చేసుకున్నారు ఫెలిక్స్ బామ్‌గాట్నర్ చేస్తున్నటువంటి ఈ సాహసాన్ని వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఈ సాహసాన్ని ప్రపం చవ్యాప్తంగా కొన్న కోట్ల మంది వీక్షించారు.