అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

లాస్‌ ఏంజిల్స్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ బెర్నార్డినో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్‌లో ఫైరింగ్‌ ఘటన జరిగింది. ఆ ఘటనలో పది మంది గాయపడ్డారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డవారిలో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు కాల్పులు జరిగినట్లు తమకు కాల్‌ వచ్చిందని, అక్కడకు వెళ్లేసరికి అందరూ కింద పడిపోయి ఉన్నారని, అందులో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కెప్టెన్‌ రిచర్డ్‌ లాహెడ్‌ తెలిపారు. లాస్‌ ఏంజిల్స్‌కు 96 కిలోవిూటర్ల దూరంలో ఉన్న శాన్‌ బెర్నార్డినో నగరంలో ఈ ఘటన జిరగింది. ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని కామన్‌ ఏరియాలో వీడియో గేమ్స్‌ ఆడేందుకు జనం గుమ్మికూడిన తర్వాత ఈ కాల్పుల ఘటన జరిగింది. ఆగస్టు 26వ తేదీన ఫ్లోరిడాలో జరిగిన వీడియో గేమ్‌ టోర్నమెంట్‌ వద్ద కాల్పులు సంఘటన చోటుచేసుకుంది. ఆ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు.

—————–