అమెరికాలో మరో జాత్యహంకార హత్య
షాపులో సిక్కును కాల్చి చంపిన దుండుగులు
న్యూయార్క్,ఆగస్ట్17(జనం సాక్షి ): అమెరికాలో మరో జాత్యహంకార హత్య చోటుచేసుకుంది. న్యూజెర్సీలో ఒక సిక్కు వ్యక్తి హత్యకు గురయ్యారు. మూడు వారాల్లో ఇదో మూడవ సంఘటన కావడం గమనార్హం. అక్కడ మైనార్టీలైన సిక్కులను లక్ష్యంగా చేసుకొని దాడుల చేస్తున్నారు. సిక్కు వ్యక్తి గురువారం అతని షాపులోనే మృతి చెంది ఉండటం బంధువు తెర్లోక్ సింగ్ గుర్తించారు. అతని చాతీపై గాయాలయ్యాయి. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆయన భార్య, పిల్లలు భారత్‌లో నివసిస్తున్నారు. అతడు దుకాణాన్ని ఆరుసంవత్సరాల నుండి నడుపుతున్నాడని స్థానికులు పేర్కొన్నారు. ఈ నెల 6న కాలిఫోర్నియాలో ఓ వృద్ద సిక్కుపై కూడా దుండగులు దాడి, హత్య చేసిన సంగతి తెలిసిందే.టేర్లోక్ సింగ్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల నుంచి న్యూజెర్సీలో స్టోర్‌ను నడుపుతున్నాడు. అయితే గురువారం రాత్రి స్టోర్‌లోకి ప్రవేశించిన దుండగులు టేర్లోక్‌ను హత్య చేశారు. సింగ్ ఛాతీపై కత్తిపోట్లు ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న సింగ్‌ను చూసి స్టోర్ సిబ్బంది తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. ఆగస్టు 6న సాహిబ్ సింగ్(71) అనే వ్యక్తిని మార్నింగ్ వాక్‌లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జులై 31న సుర్జిత్ మల్హీ(50)ను విూ దేశానికి వెళ్లిపో అని హింసిస్తూ హత్య చేశారు.
————-