అమెరికా ఎన్నికల్లో గాంధీజీ మునిమనవడు విజయం

అమెరికా : అమెరికా ఎన్నికల్లో మహాత్మాగాంధీ మునిమనుమడు విజయం సాధించారు ఈయన పేరు శాంతి గాంధీ. ఈయన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 72 ఏళ్ల శాంతిగాంధీ తన ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి థియోడోర్‌పై విజయం సాధించారు. కాన్సాస్‌ 52వ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. గాంధీ తొమ్మిది శాతం పాయింట్ల తేడాతో ఓడించారు. శాంతిగాంధీ మహాత్మాగాంధీ మనవడు దివంగత కాంతి గాంధీ కుమారుడు కార్డియోవాస్క్యులర్‌, థొరాసిక్‌ సర్జన్‌గా స్థిరపడిన శాంతి గాంధీ 2010లో కాన్సాస్‌ రాష్ట్రం టొపెకా నగరంలోని స్టోర్‌మాంట్‌ -వయిల్‌ ఆసుపత్రి నుంచి రిటైరయ్యారు. ఈనెల ఆరోతేదీన జరిగిన ఎన్నికల్లో ఆయనకు 6,413 ఓట్లు లభించగా ఎన్‌స్టీకి 5,357 ఓట్లు వచ్చాయి. శాంతిగాంధీ బొంబాయి విశ్వవిద్యాలయం వైద్య పట్టభద్రునిగా 1967లో అమెరికా చేరుకున్నారు.