అమ్మలా ఆదరించిన తస్లీమా.
-నిరాశ్రయులను ఆదరించండి, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా.
-వృద్ధుడికి తానే స్వయంగా స్నానం చేపించి,తల్లిలా సపర్యలు చేసిన తస్లీమా.
ములుగు, జూలై 26(జనంసాక్షి):- మతిస్థిమితం కోల్పోయి, నిరాశ్రయుడైన ఓ అనాధ వృద్ధుడిని అమ్మలా ఆదరించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. విషయం పూర్వపరాలోకి వెళితే
ములుగు మండలం జంగాలపల్లి ( క్రాస్ రోడ్డులో ) మల్లయ్య అనే ఓ అనాధ వృద్ధుడికి తానే స్వయంగా స్నానం చేపించి, తల్లిలా సపర్యలు చేసి బట్టలు అందించారు,స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంగళవారం వృద్ధుడి వద్దకు వెళ్ళి ఆయన పరిస్థితిని తెలుసుకున్నారు,కొన్ని సంవత్సరాలుగా ఎవరైనా పెట్టింది తినుకుంటూ ఇక్కడే తిరుగుతుంటాడని,అతడిని మల్లయ్య అని పిలుచుకుంటామని తెలిపారు,అతడి కాలుకి గాయం కావడంతో ఎవరు పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు,మాసిన గడ్డంతో ఉన్న వృద్ధుడికి బార్బర్ తో క్షవరం చేపించి,తానే స్వయంగా స్నానం చేపించి,అతడి కాలుకు ఉన్న గాయానికి బ్యాండేజ్ వేశారు, నూతన వస్త్రాలు అందించారు,మతిస్థిమితం కోల్పోయి, నిరాశ్రయులైన వారిని ఆదరించండి అని తస్లీమా కోరారు