‘అమ్మా నీకే అంకితం’ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన దాసరి
హైదరాబాద్, జనంసాక్షి: ‘అమ్మా నీకే అంకితం’ అనే ప్రత్యేక వీడియో గీతాన్ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 12న మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మురళీమోహన్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. పది నిమిషాల నిడివిగల ఈ వీడియో సాంగ్‌ను పీఎన్ నారాయణ రచించారు. సమాజంలోని స్త్రీలను గౌరవించకపోతే….. ఇంట్లో తల్లిని గౌరవించనట్లేనని ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ అన్నారు.