అమ్మో ! ఇన్నిసార్లు రాజీనామాలు చేసిండ్రా !

తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై
బ్రిటీష్‌ ప్రతినిధుల ఆశ్చర్యం
హైద్రాబాద్‌, ఆగస్టు 24(జనంసాక్షి): అమ్మో ఇన్ని సార్లు రాజీనామా చేసిండ్రా అంటూ బ్రిటిష్‌ ప్రతినిధుల పార్లమెంటరీ బృందం రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐదు రోజుల దేశ పర్యటనలో భాగంగా సర్‌ అలెస్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం రాష్ట్ర శాసనసభను సందర్శించింది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరుగుతున్న పోరాటాంలో భాగంగా ప్రజల ునోభావాలకనుగుణంగా ఈ రాజీనామాలు జరిగాయి. ఆరేళ్లలో రాష్ట్రంలో పదేపదే రాజీనామాలు చేయడం, ఏకంగా 60 స్థానాలకు ఉపెన్నికలు జరగడంపై వారు ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను సభాపతి నాదెండ్ల మనోహర్‌ వివరించడంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు చేసిన త్యాగాలను తెల్సుకొని ఆశ్చర్యపోయారు..మండలి చైర్మన్‌ చక్రపాణి, సభాపతిలతో కలిసి తొలుత వారు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. రాష్ట్రశాసనసభ పనితీరుకు సంబందించిన వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు..తమ దేశంలో రాజీనామాలు ఉండవని, ఇన్నేళ్లలో తాము ప్రవేశపెట్టిన చట్టాన్ని తిరస్కరించినందుకు ఒకే ఒక్కరు రాజీనామా చేశారని బ్రిటన్‌ ప్రతినిధులు వివరించారు.