అమ్మ కోసం సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ నియమాలపై శిక్షణ కార్యక్రమం
సోమవారం రోజున ములుగు జిల్లా వివిధ పీహెచ్సి ల నుండి వచ్చిన ఏఎన్ఎం లకు జెడ్పి కార్యాలయం లో అరమన్ సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అమ్మ కోసం సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ నియమాలు శిక్షణ కార్యక్రమం కు ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ములుగు జిల్లాలో గల రక్తహీనత గల గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు.వారిని ఏ విధంగా హైరిస్క్ అతిరక్తహీనత కాకుండా చూసుకోవాలి.ఆ గర్భిణిలకు ఇచ్చే చికిత్స ప్రాథమిక స్థాయి ద్వితీయ స్థాయి తృతీయ స్థాయిల గురించి వివరించారు మరియు వారికి అవసరం అయినా ఆరోగ్య విద్యా బోధనను గురించి విపులంగా వివరించారు మరియు జిల్లాలో ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగేటుగా సహకరించాలని హైరిస్ కేసులను గర్భిణీలను సరైన సమయంలో ప్రసవం కోసం తరలించాలని ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. మృదుల, టిఓటి డా.తేజశ్రీ ములుగు జిల్లాలో వచ్చే ప్రమాదకర గర్భధారణ, గుర్రపు వాతం,గర్భస్థ సమయంలో మధుమేహం,గర్భస్థ అధిక రక్తపోటు,గర్భస్థ సమయంలో రక్తస్రావం మొదలగు వాటి నిర్వహణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ విపిన్,