అమ్మ నాన్న చనిపోవడంతో అనాథగా మారిన కూతురు.

– అనాధ బాలికను ఆదుకున్న సుల్తాన.
– ఎన్ని డబ్బులు సంపాదించినామని ముఖ్యం కాదు.
–  పేదలకు సేవ చేయడమే అసలైన గొప్పదనం.
ఇందు ప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్.
సిద్దిపేట బ్యూరో 17, ఆగష్టు ( జనం సాక్షి )
నాడు అమ్మ నాన్న,నేడు ఆలనా పాలన చూసుకునే బాబాయి కూడా మరణించడంతో  బాలిక అనాధగా మారింది. ఇట్టి విషయం తెలుసుకున్న సామాజిక ప్రజా సేవకులు, ఇందు ప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అనాధ బాలికకు నేనున్నానంటూ ఆదుకొని తన వంతు సహకారం అందించి, గుండె ధైర్యాన్ని ఇచ్చారు. బుధవారం జగదేవ్ పూర్ మండల కేంద్రంలో అనాధ బాలికకు బియ్యం, నిత్వసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగదేవ్ పూర్ మండల కేంద్రానికి  పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం వలస వచ్చిన సంచార జాతి కుటుంబం కూలీనాలీ చేసుకుంటూ పూట గడుపుకునేవారు. గతంలో  ఆర్థిక పరిస్థితి వల్ల బాలిక తల్లిదండ్రులు మృతి చెందారు. నాటినుండి బాబాయి కృష్ణ, నానమ్మ దిక్కుగా మారారు. బాబాయి జగదేవపూర్ క్రాప్ దుకాణంలో కూలీగా పనిచేస్తూ తల్లి పోషవ్వను అన్న కూతురు స్వప్నను పోషిస్తున్నాడు. అంతలోనే తల్లి పోషవ్వ పక్షవాతంతో మంచన పడింది. కృష్ణ తల్లిని, అన్న కూతురును కూలి పని చేసుకుంటూ పోషించేవారు‌. ఆర్థిక భారం వల్ల ఇటీవల కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్వప్న(12) బాలిక అనాధగా మారింది. స్వప్న మరియు నానమ్మ పోచమ్మను పోషించే వారు లేక దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. ఈ కుటుంబ పరిస్థితి దీనంగా ఉండడంతో కనీసం కృష్ణ అంతక్రియలు చేయడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ లేక అంత్యక్రియల కోసం దాతలు చందాల రూపంలో డబ్బులు జమచేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. అలాంటి పరిస్థితులలో వీరి కుటుంబం ఉండడం చాలా బాధాకరం. మనదేశంలో ఇలాంట అనాధలను ఆదుకొని సమాజంలో మంచితనం ఉందని చాటి చెప్పాలన్నారు.ఎన్ని డబ్బులు సంపాదించినామని ముఖ్యం కాదని ఇతరులకు సేవ చేయడమే అసలైన గొప్పదనం అన్నారు.స్వాతంత్రం వచ్చిందని 75 సంవత్సరాల వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న మనము నేటికీ కూడా మనదేశంలో ఇలాంటి కుటుంబాలు ఉండటం బాధాకరం. అసలు ఇలాంటి నిరుపేద కుటుంబాలకి స్వాతంత్రం వచ్చిందా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు? మానవత్వంతో స్వప్న కుటుంబానికి మా వంతు సహకారం అందించామని, ఇంకా మానవతావాదులు, దయాహృదనేతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఈ అనాధ బాలికకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ ,ఉపసర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు బింగి మల్లేష్, వార్డ్ సభ్యులు మహేష్, సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.