అమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

ప్రతిపక్షాలు ఆలయాల విషయాలు రాజకీయం చేయడం తగదు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 1 ) జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆలయాలకు పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం
దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా శ్రీ.శ్రీ.శ్రీ.జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,స్థానిక శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత,జిల్లా కలెక్టరు .వల్లూరు క్రాంతి ఆలయాలను దర్శించు కున్నారు. దర్శించుకోవడానికి వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే, జడ్పిచైర్మన్ లు పూలబోకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్, మరియు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ.శ్రీ.శ్రీ. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ,
అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందు ఉండాలని కోరుకున్నట్టు తెలియజేశారు. దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ విషయంలో ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నారు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆలయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఎలాంటి పట్టు వస్త్రాలు సమర్పించడం లేదు అన్నారు. ఆలయాలకు వచ్చిన భక్తుల విరారాలతో కానీ ఆదాయంతోనే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమర్పించడం జరుగుతుంది అని తెలిపారు. దయచేసి ఆలయ పై రాజకీయ రంగులు పుయొద్దని తెలియజేశారు.ఈ సారి కూడా అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని తెలిపారు. అలాగే నిన్నే అమ్మవారికి అభిషేకం మరియు హోమం చేసే పూజ సామాగ్రిని ఆలయ చైర్మెన్ కి సీఎం కేసీఆర్ ఇంటి నుండి పంపించారని అన్నారు. నాలుగవ తారీకు రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , సీఎం కుటుంబ సభ్యులు మొత్తం అమ్మవారిని దర్శించుకోవడానికి రానున్నారని తెలిపారు.మంత్రి వెంట రాజోలి జెడ్పిటిసి రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు,టిఆర్ఎస్ కార్యకర్తలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.