అరుణ్‌జైట్లీతో పీడీపీ నేతల భేటీ

జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ముందుకు కదిలాయి. రెండు నెలల నుంచి ఎన్నో చర్చలు జరిగినప్పటికీ.. కామన్ మినిమం ప్రోగ్రాం మీద ఒక అభిప్రాయానికి రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. దీంతో పీడీపీ నేతలు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో మరోసారి సమావేశమయ్యారు. అన్ని అంశాల్లో ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ.. ఆర్టికల్ 370, భద్రతా బలగాలకు ప్రత్యేకాధికారాలు వంటి కొన్ని అంశాలపై రెండు పార్టీల మధ్యసయోధ్య కుదరలేదు. జైట్లీతో జరిగిన భేటీలో పీడీపీ నాయకులు ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. రెండు నెలల నుంచి ప్రభుత్వ ఏర్పాటు అంశం ముందుకు కదలక పోవడంతో స్వయంగా ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.