అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో
దంతాలపల్లి: సడక్ బందులో పాల్గొన్న ఐకాస, తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నరసింహుల పేట మండలం దంతాలపల్లిలో రాజకీయ ఐకాస, తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ఐకాస ఛైర్మన్ కోదండరాంను, తెలంగాణవాదులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకాస మండల కన్వీనర్ వెంకన్నతో పాటు పలువురు ఐకాస, తెరాస నేతలు పాల్గొన్నారు.