అర్హులైన కార్మికులకు వెంటనే లేబర్ కార్డులు మంజూరు
రుద్రంగి జూలై 28 (జనం సాక్షి);
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కార్మిక సంఘంలతో సమావేశం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లేబర్ కార్డుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే కార్డులు మంజూరు చేసులని డిమాండ్ చేశారు.లేబర్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకున్న కార్మికుల కాగితాలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావటం లేదని అన్నారు.నెలల తరబడి కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.
లేబర్ ఆఫీస్ లో అధికారులు మారుతూ ఉండడం వల్ల కార్మికుల కార్డుల మంజూరు ప్రక్రియ పెండింగ్ లో పడుతుందని అందువల్ల కార్మికులకు అందాల్సిన బెనిఫిట్స్ అందడం లేదని అన్నారు.పోయిన నెలలో కలెక్టర్ కి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొరినప్పటకి ఎలాంటి స్పందన లేదని అన్నారు.మీ సేవా వారు లేబర్ ఆఫీసర్లు కుమ్మక్కై కార్మికులకు లేబర్ కార్డులు ఇవ్వడం లేదని అన్నారు.కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆగస్ట్ ఒకటవ తరికున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కు ప్రతి ఒక్క కార్మికుడు హాజరుకావాలని కోరారు.